కథలతో తెలుగు నేర్చుకోండి.
Section 1: Telugu Story
చందమామ మరియు టోపీ — The Moon and the Cap

మేమందరమూ దసరా సంతకు వెళ్ళాము.
మా నాన్నగారు చింటూకి రంగు కళ్ళద్దాలు కొన్నారు. అమ్మ నాకు ముదురు నీలం రంగు టోపీ కొంది. పాపాయికి పీచు మిఠాయి కొన్నారు.
మేము ఇంటికి వెళ్తుండగా, గాలి గట్టిగా వీచి నా టోపీ ఎగిరిపోయింది.
నా టోపీ ఒక రావి చెట్టు కొమ్మకు చిక్కుకుంది.
నేను చాలా ఏడ్చాను. రాత్రి భోజనం కూడా చెయ్యలేదు.
రాత్రి చందమామ పైకి వచ్చాడు. రావి చెట్టుమీద ఉన్న నా టోపీని చూసాడు.
చందమామ నా టోపీ పెట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వాడు. నేను కూడా చిరునవ్వు నవ్వాను.
మర్నాడు స్కూలు తరువాత నాకు మా అమ్మ మెరుస్తున్న ఎర్రరంగు టోపీని ఇచ్చింది. “చందమామ పంపించాడు,” అంది.
ఆ రోజు రాత్రి, చందమామ, నేనూ కూడా టోపీలు పెట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వాము.
బహుశా సూర్యుడికి కూడా టోపి కావాలేమో చెప్పండి?
నేను ఏ టోపీని పెట్టుకుంటానో ఊహించగలరా?
Section 2: Sentence-by-Sentence Translation
| No. | Telugu | English |
|---|---|---|
| 1 | మేమందరమూ దసరా సంతకు వెళ్ళాము. | We all went to the Dasara fair. |
| 2 | మా నాన్నగారు చింటూకి రంగు కళ్ళద్దాలు కొన్నారు. | Our father bought coloured glasses for Chintu. |
| 3 | అమ్మ నాకు ముదురు నీలం రంగు టోపీ కొంది. | Mother bought me a dark blue cap. |
| 4 | పాపాయికి పీచు మిఠాయి కొన్నారు. | They bought candyfloss for the baby. |
| 5 | మేము ఇంటికి వెళ్తుండగా, గాలి గట్టిగా వీచి నా టోపీ ఎగిరిపోయింది. | As we were going home, a strong wind blew my cap away. |
| 6 | నా టోపీ ఒక రావి చెట్టు కొమ్మకు చిక్కుకుంది. | My cap got caught on a branch of a peepal tree. |
| 7 | నేను చాలా ఏడ్చాను. | I cried a lot. |
| 8 | రాత్రి భోజనం కూడా చెయ్యలేదు. | I did not even eat dinner. |
| 9 | రాత్రి చందమామ పైకి వచ్చాడు. | At night, the moon rose. |
| 10 | రావి చెట్టుమీద ఉన్న నా టోపీని చూసాడు. | He saw my cap on the peepal tree. |
| 11 | చందమామ నా టోపీ పెట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వాడు. | The moon put on my cap and smiled happily. |
| 12 | నేను కూడా చిరునవ్వు నవ్వాను. | I smiled too. |
| 13 | మర్నాడు స్కూలు తరువాత నాకు మా అమ్మ మెరుస్తున్న ఎర్రరంగు టోపీని ఇచ్చింది. | The next day, after school, Mother gave me a shiny red cap. |
| 14 | “చందమామ పంపించాడు,” అంది. | “The moon sent it,” she said. |
| 15 | ఆ రోజు రాత్రి, చందమామ, నేనూ కూడా టోపీలు పెట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వాము. | That night, the moon and I both wore our caps and smiled happily. |
| 16 | బహుశా సూర్యుడికి కూడా టోపి కావాలేమో చెప్పండి? | Tell me, do you think the sun might want a cap too? |
| 17 | నేను ఏ టోపీని పెట్టుకుంటానో ఊహించగలరా? | Can you guess which cap I will wear? |
Section 3: Vocabulary
| Telugu | Pronunciation | Part of speech | Meaning |
|---|---|---|---|
| టోపీ | topee | noun | cap |
| అమ్మ | amma | noun | mother |
| గాలి | gaali | noun | wind |
| చెట్టు | chettu | noun | tree |
| కొమ్మ | komma | noun | branch |
| రాత్రి | raatri | noun | night |
| చందమామ | chandamaama | noun | moon; an affectionate name for the moon |
| చిరునవ్వు | chirunavvu | noun | smile |
| సూర్యుడు | sooryudu | noun | sun |
| ఎర్రరంగు | errarangu | noun | red colour |
The pronunciation spellings are simple reading aids. Aa, ee and oo mark long vowels. Short and long e/o share the same simple spelling here, and some distinct consonants do too; check the Telugu letters and listen to the sounds.
Continue your language learning journey with these lessons:
Source: చందమామ మరియు టోపీ by Rohini Nilekani, Telugu translation by Ambika Ananth, from the Pratham Books collection, CC BY 4.0. Telugu text retained from the Global ASP edition; layout changed. English translation and learning notes by LangFastPro. Source illustrations are not reproduced.




