కథలతో తెలుగు నేర్చుకుందాం.
Section 1: Telugu Story
మంచం క్రింద — Under My Bed

నాకు దాహం వేసి రాత్రి నిద్ర లేచాను. నాకు కొంచెం మంచి నీళ్ళు కావాలి. నేను నా చెప్పులకోసం మంచం క్రింద చూడసాగాను.
ఓరి దేవుడా! నా మంచం క్రింద ఒక పులి ఉంది.
ఇప్పుడు నేను ఏం చెయ్యాలి?
నేను అమ్మను పిలవనా? అప్పుడు పులి అరిస్తే ఎలాగ?
పోనీ ఇప్పుడు మళ్ళీ నిద్రపోనా? కాని నాకు ఇప్పుడు నిద్ర రావటంలేదే.
అప్పుడే ఎవరో లైటు వేసారు. అమ్మ తలుపు దగ్గర నిల్చుని ఉంది.
"ఏమయింది రా కన్నా?" "నన్ను కాని పిలిచావా" అని అమ్మ అడిగింది.
నేను పులి వైపు వేలు చూపించాను. అమ్మ వంగి మంచం క్రింద నించి పులిని లాగింది!
ఏయ్, ఇది పులి కాదు. ఇది దళసరిగా ఉన్న నా పసుపు, నలుపు రంగుల స్వెట్టర్. దీని బొత్తాలు పులి కళ్ళ లా మెరుస్తూ ఉంటాయి.
నేను అనవసరంగా భయపడ్డాను! అమ్మ నాకు కొంచెం మంచి నీళ్ళు తెచ్చింది.
ఇప్పుడు నేను హాయిగా నిద్రపోయి అడివిలో ఉండే నిజమైన పులుల గురించి కలగంటాను.
చదవడానికి సహాయం: English letters భాగం చదవడానికి ఒక సహాయం మాత్రమే. నీళ్ళు, కళ్ళలోని ళ శబ్దానికి నాలుకను కొంచెం వెనక్కి మడవాలి.
Reading help: The English letters are a simple reading aid. In neellu and kalla, the ళ sound uses a slightly curled-back tongue. Simple Roman spelling does not distinguish every Telugu sound.
Section 2: Sentence-by-Sentence Translation
| # | Telugu (తెలుగు) | English Translation |
|---|---|---|
| 1 | నాకు దాహం వేసి రాత్రి నిద్ర లేచాను. | I woke up in the night feeling thirsty. |
| 2 | నాకు కొంచెం మంచి నీళ్ళు కావాలి. | I wanted some drinking water. |
| 3 | నేను నా చెప్పులకోసం మంచం క్రింద చూడసాగాను. | I began looking under the bed for my slippers. |
| 4 | ఓరి దేవుడా! | Oh my goodness! |
| 5 | నా మంచం క్రింద ఒక పులి ఉంది. | There was a tiger under my bed. |
| 6 | ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? | What should I do now? |
| 7 | నేను అమ్మను పిలవనా? | Should I call Mum? |
| 8 | అప్పుడు పులి అరిస్తే ఎలాగ? | What if the tiger roars then? |
| 9 | పోనీ ఇప్పుడు మళ్ళీ నిద్రపోనా? | Should I just go back to sleep now? |
| 10 | కాని నాకు ఇప్పుడు నిద్ర రావటంలేదే. | But now I could not get to sleep. |
| 11 | అప్పుడే ఎవరో లైటు వేసారు. | Just then, someone switched on the light. |
| 12 | అమ్మ తలుపు దగ్గర నిల్చుని ఉంది. | Mum was standing by the door. |
| 13 | "ఏమయింది రా కన్నా?" | “What happened, my dear?” |
| 14 | "నన్ను కాని పిలిచావా" అని అమ్మ అడిగింది. | “Did you call me?” Mum asked. |
| 15 | నేను పులి వైపు వేలు చూపించాను. | I pointed at the tiger. |
| 16 | అమ్మ వంగి మంచం క్రింద నించి పులిని లాగింది! | Mum bent down and pulled the tiger out from under the bed! |
| 17 | ఏయ్, ఇది పులి కాదు. | Hey, this was not a tiger. |
| 18 | ఇది దళసరిగా ఉన్న నా పసుపు, నలుపు రంగుల స్వెట్టర్. | It was my thick yellow-and-black sweater. |
| 19 | దీని బొత్తాలు పులి కళ్ళ లా మెరుస్తూ ఉంటాయి. | Its buttons shine like a tiger’s eyes. |
| 20 | నేను అనవసరంగా భయపడ్డాను! | I had been frightened for no reason! |
| 21 | అమ్మ నాకు కొంచెం మంచి నీళ్ళు తెచ్చింది. | Mum brought me some drinking water. |
| 22 | ఇప్పుడు నేను హాయిగా నిద్రపోయి అడివిలో ఉండే నిజమైన పులుల గురించి కలగంటాను. | Now I can sleep peacefully and dream about real tigers living in the forest. |
Section 3: Vocabulary
| Telugu (తెలుగు) | Transliteration | Part of Speech | English Meaning |
|---|---|---|---|
| దాహం | daaham | Noun | thirst |
| రాత్రి | raatri | Noun | night |
| నిద్ర | nidra | Noun | sleep |
| నీళ్ళు | neellu | Noun | water |
| మంచం | mancham | Noun | bed |
| క్రింద | krinda | Postposition | under; beneath |
| పులి | puli | Noun | tiger |
| ఇప్పుడు | ippudu | Adverb | now |
| మళ్ళీ | mallee | Adverb | again |
| అమ్మ | amma | Noun | mother; Mum |
| తలుపు | talupu | Noun | door |
| వేలు | velu | Noun | finger |
| పసుపు | pasupu | Colour word | yellow |
| నలుపు | nalupu | Colour word | black |
| స్వెట్టర్ | swettar | Noun | sweater |
| బొత్తాలు | bottaalu | Noun | buttons |
| కళ్ళ | kalla | Noun form | of eyes |
| అనవసరంగా | anavasarangaa | Adverb | needlessly; for no reason |
| భయపడ్డాను | bhayapaddaanu | Verb | I was frightened |
| హాయిగా | haayigaa | Adverb | comfortably; peacefully |
Source: మంచం క్రింద, Telugu translation by Sugunasri of Anupa Lal’s English story Under My Bed, published by Pratham Books (© Pratham Books, 2015) on StoryWeaver under CC BY 4.0. Original book illustrated by Suvidha Mistry; print edition supported by Parag. Telugu text retained with layout changes. New English translation, reading help, learning notes and illustration by LangFastPro; source illustrations are not reproduced.




