అద్దంలో ఉన్న స్నేహితురాలితో ఒక చిన్నారి కథ చదవండి.
Section 1: Telugu Story
నా మంచి స్నేహితురాలు — My Best Friend

నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె కూడా మా ఇంటిలోనే ఉంటుంది.
నేను ఆనందంగా ఉన్నప్పుడు, తను కూడా ఆనందంగా ఉంటుంది.
నేను ఏడిస్తే, తను కూడా ఏడుస్తుంది.
కాని ఆమె మాటలు నాకు వినిపించవు. నా స్నేహితురాలు అద్దం లోపల ఉంది.
నేను ఆమెని "ఆడుకుందాం బయటకి రమ్మని" చప్పాను. కాని తను బయటకి రాలేదు.
నాకు చాలా బాధ అనిపించింది. నేను నిద్రలోకి జారుకున్నాను.
నిద్రలో ఆమె అద్దంలోపలి నుండి బయటకు వస్తుంది! అప్పుడు మేము సరదాగా గడుపుతాము.
మేమిద్దరం కలిసి ఆడుకుంటాము, పరిగెడతాము, అరుస్తాము, కేకలు వేస్తాము.
నేను తనతో మాట్లాడితే, తను కూడా నాతో మాట్లాడుతుంది.
మరునాడు ఉదయం, నా స్నేహితురాలు మళ్ళీ అద్దంలోకి వెళ్ళిపోతుంది.
కాని నేను నిరాశపడలేదు. మేము మళ్ళీ నా కలలో ఆడుకుంటాము!
Section 2: Sentence-by-Sentence Translation
| # | Telugu (తెలుగు) | English Translation |
|---|---|---|
| 1 | నాకు ఒక స్నేహితురాలు ఉంది. | I have a friend. |
| 2 | ఆమె కూడా మా ఇంటిలోనే ఉంటుంది. | She also lives in our house. |
| 3 | నేను ఆనందంగా ఉన్నప్పుడు, తను కూడా ఆనందంగా ఉంటుంది. | When I am happy, she is happy too. |
| 4 | నేను ఏడిస్తే, తను కూడా ఏడుస్తుంది. | When I cry, she cries too. |
| 5 | కాని ఆమె మాటలు నాకు వినిపించవు. | But I cannot hear her words. |
| 6 | నా స్నేహితురాలు అద్దం లోపల ఉంది. | My friend is inside the mirror. |
| 7 | నేను ఆమెని "ఆడుకుందాం బయటకి రమ్మని" చప్పాను. | I told her, “Come outside so we can play.” |
| 8 | కాని తను బయటకి రాలేదు. | But she did not come outside. |
| 9 | నాకు చాలా బాధ అనిపించింది. | I felt very sad. |
| 10 | నేను నిద్రలోకి జారుకున్నాను. | I drifted off to sleep. |
| 11 | నిద్రలో ఆమె అద్దంలోపలి నుండి బయటకు వస్తుంది! | In my sleep, she comes out from inside the mirror! |
| 12 | అప్పుడు మేము సరదాగా గడుపుతాము. | Then we have a good time. |
| 13 | మేమిద్దరం కలిసి ఆడుకుంటాము, పరిగెడతాము, అరుస్తాము, కేకలు వేస్తాము. | The two of us play together, run, shout and scream. |
| 14 | నేను తనతో మాట్లాడితే, తను కూడా నాతో మాట్లాడుతుంది. | When I talk to her, she talks to me too. |
| 15 | మరునాడు ఉదయం, నా స్నేహితురాలు మళ్ళీ అద్దంలోకి వెళ్ళిపోతుంది. | The next morning, my friend goes back into the mirror. |
| 16 | కాని నేను నిరాశపడలేదు. | But I did not feel disappointed. |
| 17 | మేము మళ్ళీ నా కలలో ఆడుకుంటాము! | We will play again in my dream! |
Section 3: Vocabulary
| Telugu | Transliteration | Part of Speech | English Meaning |
|---|---|---|---|
| స్నేహితురాలు | snehituraalu | Noun | female friend |
| ఇంటిలోనే | intilone | Noun phrase | in the house itself |
| ఆనందంగా | aanandangaa | Adverb | happily |
| ఏడిస్తే | ediste | Verb form | if/when I cry |
| మాటలు | maatalu | Noun | words; speech |
| వినిపించవు | vinipinchavu | Verb | cannot be heard |
| అద్దం | addam | Noun | mirror |
| లోపల | lopala | Adverb | inside |
| బయటకి | bayataki | Adverb | outside; to the outside |
| ఆడుకుందాం | aadukundaam | Verb | let us play |
| బాధ | baadha | Noun | sadness; distress |
| నిద్ర | nidra | Noun | sleep |
| సరదాగా | saradagaa | Adverb | happily; having fun |
| కలిసి | kalisi | Adverb | together |
| పరిగెడతాము | parigedataamu | Verb | we run |
| కేకలు వేస్తాము | kekalu vestaamu | Verb phrase | we shout; we scream |
| మరునాడు | marunaadu | Adverb | the next day |
| ఉదయం | udayam | Noun | morning |
| మళ్ళీ | mallee | Adverb | again |
| కలలో | kalalo | Noun phrase | in a dream |
Source: నా మంచి స్నేహితురాలు, by Anupa Lal, Telugu translation by Sugunasri. Original and Telugu translation © Pratham Books, 2015, CC BY 4.0. English translation, reading help, narration and new illustration prepared by LangFastPro.




