నా ఇల్లు — My House

LangFastPro Editorial Team's avatar
Lesson prepared byLangFastPro Editorial Team
More

కథలతో తెలుగు నేర్చుకుందాం.

Section 1: Telugu Story

నా ఇల్లు — My House

A girl welcomes visitors at her front door, with shoes and sandals set to one side.

Listen to the story0:00 / 0:00

ఇది మా ఇల్లు.

నా మొత్తం కుటుంబంతో నేను ఇక్కడ నివసిస్తున్నాను.

మేము బూట్లని, చెప్పులని ఇక్కడ విడిచేస్తాము.

మేము ముఖాల్ని, చేతుల్ని ఇక్కడ శుభ్రం చేసుకుంటాము.

నేను నా బట్టల్ని ఇక్కడ వ్రేలాడదీస్తాను.

మా తాతగారు తన కర్రని ఈ మూల పెడతారు.

మేము మా చాపలని ఇక్కడ ఉంచుతాము.

మా నాన్నగారు తన మోటారుసైకిలుని బయట ఉంచుతారు.

కానీ, ఆయన హెల్మెట్ అల్మారా పైన ఉంచుతారు.

మా అమ్మగారు, బామ్మగారు తమ చీరల్ని ఈ పెట్టెలో ఉంచుతారు.

వంటగదిలో రుచికరమైన ఆహారం తయారవుతుంది.

చలిగా ఉన్నప్పుడు మేము బొంతల్ని బయటికి తీస్తాము.

వేడిగా ఉన్నప్పుడు ఫేన్ ని ఉపయోగిస్తాము.

ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు కుర్చీలని బయటికి తెస్తాము.

మీరు మాయింటికి ఓసారి వచ్చి చూడండి. త్వరలో రండి.

Section 2: Sentence-by-Sentence Translation

#Telugu (తెలుగు)English Translation
1ఇది మా ఇల్లు.This is our house.
2నా మొత్తం కుటుంబంతో నేను ఇక్కడ నివసిస్తున్నాను.I live here with my whole family.
3మేము బూట్లని, చెప్పులని ఇక్కడ విడిచేస్తాము.We take off our shoes and slippers here.
4మేము ముఖాల్ని, చేతుల్ని ఇక్కడ శుభ్రం చేసుకుంటాము.We wash our faces and hands here.
5నేను నా బట్టల్ని ఇక్కడ వ్రేలాడదీస్తాను.I hang my clothes here.
6మా తాతగారు తన కర్రని ఈ మూల పెడతారు.My grandfather puts his walking stick in this corner.
7మేము మా చాపలని ఇక్కడ ఉంచుతాము.We keep our mats here.
8మా నాన్నగారు తన మోటారుసైకిలుని బయట ఉంచుతారు.My father keeps his motorcycle outside.
9కానీ, ఆయన హెల్మెట్ అల్మారా పైన ఉంచుతారు.But he keeps his helmet on top of the cupboard.
10మా అమ్మగారు, బామ్మగారు తమ చీరల్ని ఈ పెట్టెలో ఉంచుతారు.My mother and grandmother keep their saris in this trunk.
11వంటగదిలో రుచికరమైన ఆహారం తయారవుతుంది.Delicious food is made in the kitchen.
12చలిగా ఉన్నప్పుడు మేము బొంతల్ని బయటికి తీస్తాము.When it's cold, we get out our quilts.
13వేడిగా ఉన్నప్పుడు ఫేన్ ని ఉపయోగిస్తాము.When it's hot, we use the fan.
14ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు కుర్చీలని బయటికి తెస్తాము.When special guests come, we bring out the chairs.
15మీరు మాయింటికి ఓసారి వచ్చి చూడండి.Come and visit us sometime.
16త్వరలో రండి.Come soon.

Section 3: Vocabulary

కొన్ని పదాలు మూలరూపంలో ఉన్నాయి. Some entries are in their base forms. For example, చీర (cheera) means “sari,” and చీరల్ని (cheeralni) means “the saris” in this sentence.

Telugu (తెలుగు)TransliterationPart of SpeechEnglish Meaning
ఇల్లుilluNounhouse; home
కుటుంబంkutumbamNounfamily
ఇక్కడikkadaAdverbhere
బూట్లుbootluNounshoes; boots
చెప్పులుcheppuluNounslippers or sandals
చేతులుchetuluNounhands
బట్టలుbattaluNounclothes
కర్రkarraNounstick; here, a walking stick
మూలmoolaNouncorner
చాపchaapaNounmat
బయటbayataAdverboutside
అల్మారాalmaaraaNouncupboard
చీరcheeraNounsari
పెట్టెpetteNounbox; here, a storage trunk
వంటగదిvantagadiNounkitchen
బొంతbontaNounquilt
కుర్చీkurcheeNounchair
అతిథులుatithuluNounguests
చూడండిchoodandiVerbplease look; please see
రండిrandiVerbplease come

Source: నా ఇల్లు, written by Rukmini Banerji in Hindi and translated into Telugu by T. Ramachandra Rao (both editions © Pratham Books, 2007), on StoryWeaver, CC BY 4.0. English translation, reading notes and new illustration by LangFastPro.

Related lessons