నేను సాయం చెయ్యగలను! — I Can Help!

LangFastPro Editorial Team's avatar
Lesson prepared byLangFastPro Editorial Team
More

కథలతో తెలుగు నేర్చుకుందాం.

Section 1: Telugu Story

నేను సాయం చెయ్యగలను! — I Can Help!

A girl helps her little brother eat rice at home

Listen to the story0:00 / 0:00

నేను ఇప్పుడొక పెద్ద అమ్మాయిని. నేను ఇతరులకు సాయం చేయగలను.

బడి అయిపోయిన తరువాత మా తమ్ముడికి అన్నం తినిపించడం నాకు ఇష్టం. వాడికి కూడా అదెంతో ఇష్టం!

నాకు సెలవు ఉన్న రోజు, మా అమ్మకు ఆఫీసుకి వెళ్లేందుకు తయారు కావడంలో సాయం చేస్తాను.

సాయంత్రం మా నాన్నకు నేను దుకాణంలో సాయం చేస్తాను.

కానీ ఒక్కో సారి అమ్మ అంటుంది, "దయచేసి నాకు సాయం చెయ్యవద్దు," అని.

అంతే కాదు. నాన్న కూడా ఒక్కొక్క సారి, "థాంక్స్ అమ్మా, కానీ, ఈ వేళ నీ సాయం వద్దురా!" అంటారు.

ఒక్కొక్కసారేమో, నన్ను ఒక చోట కూర్చోమని ఇద్దరూ కలిసి చెప్తారు.

అప్పుడు నాకు పుస్తకం చదువుకోవడం ఇష్టం.

నాకు మా అమ్మమ్మకి సాయం చెయ్యాలని ఉంటుంది. ఆవిడ నాకు కథలు చెబుతుంది.

మా తమ్ముడు ఇంకా చిన్నవాడు. ఏమీ సాయం చెయ్యలేడు.

కానీ నేను పెద్ద పిల్లను.

నేను ఇతరులకు సాయం చేయగలను.

Section 2: Sentence-by-Sentence Translation

#TeluguEnglish
1నేను ఇప్పుడొక పెద్ద అమ్మాయిని.I’m a big girl now.
2నేను ఇతరులకు సాయం చేయగలను.I can help other people.
3బడి అయిపోయిన తరువాత మా తమ్ముడికి అన్నం తినిపించడం నాకు ఇష్టం.After school, I like feeding my little brother his rice.
4వాడికి కూడా అదెంతో ఇష్టం!He loves it too!
5నాకు సెలవు ఉన్న రోజు, మా అమ్మకు ఆఫీసుకి వెళ్లేందుకు తయారు కావడంలో సాయం చేస్తాను.On my day off, I help my mom get ready for work.
6సాయంత్రం మా నాన్నకు నేను దుకాణంలో సాయం చేస్తాను.In the evening I help my dad at his shop.
7కానీ ఒక్కో సారి అమ్మ అంటుంది, "దయచేసి నాకు సాయం చెయ్యవద్దు," అని.But sometimes Mom says, “Please don’t help me.”
8అంతే కాదు.And it’s not just Mom.
9నాన్న కూడా ఒక్కొక్క సారి, "థాంక్స్ అమ్మా, కానీ, ఈ వేళ నీ సాయం వద్దురా!" అంటారు.Sometimes Dad says, “Thanks, dear, but I don’t need your help right now!”
10ఒక్కొక్కసారేమో, నన్ను ఒక చోట కూర్చోమని ఇద్దరూ కలిసి చెప్తారు.Sometimes they both tell me to sit down in one spot.
11అప్పుడు నాకు పుస్తకం చదువుకోవడం ఇష్టం.Then I like to read a book.
12నాకు మా అమ్మమ్మకి సాయం చెయ్యాలని ఉంటుంది.I want to help my grandmother.
13ఆవిడ నాకు కథలు చెబుతుంది.She tells me stories.
14మా తమ్ముడు ఇంకా చిన్నవాడు.My little brother is still little.
15ఏమీ సాయం చెయ్యలేడు.He can’t help at all.
16కానీ నేను పెద్ద పిల్లను.But I’m a big girl.
17నేను ఇతరులకు సాయం చేయగలను.I can help other people.

Section 3: Vocabulary

కొన్ని పదాలను మూలరూపంలో ఇచ్చాం. Some words are listed in their base form.

TeluguTransliterationPart of SpeechEnglish Meaning
సాయంsaayamnounhelp
పెద్దpeddaadjectivebig; older in this story
బడిbadinounschool
తమ్ముడుtammudunounyounger brother
అన్నంannamnouncooked rice
తినిపించుtinipinchuverbfeed someone
ఇష్టంishtamnounliking; in this story, to like
సెలవుselavunounday off; leave
ఆఫీసుaapheesunounoffice
తయారు కావడంtayaaru kaavadamverb phrasegetting ready
సాయంత్రంsaayantramnounevening
దుకాణంdukaanamnounshop
ఒక్కోసారిokkosaariadverbsometimes
దయచేసిdayachesiadverbplease
పుస్తకంpustakamnounbook
అమ్మమ్మammammanoungrandmother on your mother’s side
కథkathanounstory
చిన్నవాడుchinnavaadunounlittle boy

Source: నేను సాయం చెయ్యగలను! by Mini Shrinivasan, translated into Telugu by Janaki Rani Turaga, originally illustrated by Aman Randhawa (original edition © Pratham Books, 2013), published on Pratham Books’ StoryWeaver. The print edition was supported by Parag and developed in collaboration with Srishti School of Art, Design and Technology. Telugu text preserved in the Global ASP edition, CC BY 4.0. English translation from the Telugu, Roman reading aid and learning notes by LangFastPro.

Related lessons