కథలతో తెలుగు నేర్చుకుందాం.
Section 1: Telugu Story
బట్టల్నీ ఉతికేశాం! — We Washed All the Clothes!

నా పేరు మేరీ. ఇది మా ఇల్లు.
మళ్ళీ తెల్లవారింది. ఈరోజు బట్టలు ఉతుక్కోవాలి.
అందరి చేతుల నిండా సబ్బు నురగలు.
వీధుల్లో సబ్బు నీళ్ళ మడుగులు, వాటిల్లో ఇంద్రధనుస్సులు - రంగురంగులుగా.
గ్రేస్ అత్తయ్య తన యూనిఫామ్ ని ఉతుక్కుంది. రేపు హాస్పిటల్ కి అది వేసుకొని వెళుతుంది.
జాను ఆత దుప్పటిని ఆరేసింది. అది వాళ్ళ అమ్మమ్మ స్వయంగా వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు నేసిన దుప్పటి. దాని రంగూ జాను ఆత ఇంటి రంగూ ఒకటే.
ఫాతిమా అత్త తన మెడకి చుట్టుకునే రుమాళ్ళు అన్నీ ఆరేసింది. అవి వేసుకుంటే భలే వాసన వస్తాయి.
ఆటో నడిపే జకీర్ తాత తన ఖాకీ యూనిఫామ్ ని కూడా ఉతికి ఆరేశాడు. ఆరిన తర్వాత దానికి ఊడిపోయిన బటన్ కుట్టుకుంటాడు.
గీత అత్త కాటన్ చీరలు గాలికి ఊగుతున్నాయి. అవి ఊగుతుంటే, పక్షులు రివ్వున ఎగురుతూ తమ రెక్కల్ని పటపటా కొట్టుకుంటున్నట్టు శబ్దం.
జోసఫ్ అంకుల్ దండెం నిండా సాక్సులే. సెక్యూరిటీ గార్డ్ గా పని చేసే ఆయన పాదాలని అవి వెచ్చగా ఉంచుతాయి.
నేను, మా డేవిడ్ అన్నయ్య మా స్కూల్ యూనిఫామ్స్ ఉతుక్కోవడం మొదలుపెట్టాము. జేబుల మీద ఇంకు మరకలు, చేతుల మీద చాక్ పీస్ దుమ్ము పోయేట్టుగా బాగా రుద్దాము.
మళ్ళీ రేపు వాడినప్పుడు మురికి అవుతాయి కానీ ఇప్పుడు మాత్రం అన్ని బట్టలూ శుభపడ్డట్టే.
Section 2: Sentence-by-Sentence Translation
| # | Telugu (తెలుగు) | English Translation |
|---|---|---|
| 1 | నా పేరు మేరీ. | My name is Mary. |
| 2 | ఇది మా ఇల్లు. | This is our house. |
| 3 | మళ్ళీ తెల్లవారింది. | Dawn has come again. |
| 4 | ఈరోజు బట్టలు ఉతుక్కోవాలి. | Today we have to wash clothes. |
| 5 | అందరి చేతుల నిండా సబ్బు నురగలు. | Everyone’s hands are full of soap suds. |
| 6 | వీధుల్లో సబ్బు నీళ్ళ మడుగులు, వాటిల్లో ఇంద్రధనుస్సులు - రంగురంగులుగా. | There are puddles of soapy water in the streets, with colourful rainbows in them. |
| 7 | గ్రేస్ అత్తయ్య తన యూనిఫామ్ ని ఉతుక్కుంది. | Aunt Grace washed her uniform. |
| 8 | రేపు హాస్పిటల్ కి అది వేసుకొని వెళుతుంది. | She will wear it to the hospital tomorrow. |
| 9 | జాను ఆత దుప్పటిని ఆరేసింది. | Jaanu Aata hung her blanket out to dry. |
| 10 | అది వాళ్ళ అమ్మమ్మ స్వయంగా వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు నేసిన దుప్పటి. | It is a blanket her grandmother wove herself when she was in their village. |
| 11 | దాని రంగూ జాను ఆత ఇంటి రంగూ ఒకటే. | Its colour and the colour of Jaanu Aata’s house are the same. |
| 12 | ఫాతిమా అత్త తన మెడకి చుట్టుకునే రుమాళ్ళు అన్నీ ఆరేసింది. | Aunt Fatima hung out all the scarves she wraps around her neck. |
| 13 | అవి వేసుకుంటే భలే వాసన వస్తాయి. | They smell lovely when she wears them. |
| 14 | ఆటో నడిపే జకీర్ తాత తన ఖాకీ యూనిఫామ్ ని కూడా ఉతికి ఆరేశాడు. | Grandpa Zakir, who drives an auto-rickshaw, also washed and hung out his khaki uniform. |
| 15 | ఆరిన తర్వాత దానికి ఊడిపోయిన బటన్ కుట్టుకుంటాడు. | After it dries, he will sew back the button that came off. |
| 16 | గీత అత్త కాటన్ చీరలు గాలికి ఊగుతున్నాయి. | Aunt Geeta’s cotton saris are swaying in the wind. |
| 17 | అవి ఊగుతుంటే, పక్షులు రివ్వున ఎగురుతూ తమ రెక్కల్ని పటపటా కొట్టుకుంటున్నట్టు శబ్దం. | As they sway, they make a sound like birds flying swiftly and flapping their wings. |
| 18 | జోసఫ్ అంకుల్ దండెం నిండా సాక్సులే. | Uncle Joseph’s clothesline is full of socks. |
| 19 | సెక్యూరిటీ గార్డ్ గా పని చేసే ఆయన పాదాలని అవి వెచ్చగా ఉంచుతాయి. | They keep his feet warm while he works as a security guard. |
| 20 | నేను, మా డేవిడ్ అన్నయ్య మా స్కూల్ యూనిఫామ్స్ ఉతుక్కోవడం మొదలుపెట్టాము. | My older brother David and I began washing our school uniforms. |
| 21 | జేబుల మీద ఇంకు మరకలు, చేతుల మీద చాక్ పీస్ దుమ్ము పోయేట్టుగా బాగా రుద్దాము. | We scrubbed hard to remove the ink stains on the pockets and the chalk dust on the sleeves. |
| 22 | మళ్ళీ రేపు వాడినప్పుడు మురికి అవుతాయి కానీ ఇప్పుడు మాత్రం అన్ని బట్టలూ శుభపడ్డట్టే. | They will get dirty again when we wear them tomorrow, but for now all the clothes are clean. |
Section 3: Vocabulary
| Telugu | Transliteration | Part of Speech | English Meaning |
|---|---|---|---|
| ఇల్లు | illu | Noun | house; home |
| తెల్లవారింది | tellavaarindi | Verb | dawn came |
| బట్టలు | battalu | Noun | clothes |
| ఉతుక్కోవాలి | utukkovaali | Verb | must wash |
| సబ్బు | sabbu | Noun | soap |
| నురగలు | nuragalu | Noun | suds; foam |
| మడుగులు | madugulu | Noun | puddles |
| ఇంద్రధనుస్సులు | indradhanussulu | Noun | rainbows |
| దుప్పటి | duppati | Noun | blanket |
| అమ్మమ్మ | ammamma | Noun | maternal grandmother |
| నేసిన | nesina | Verb form | woven |
| రుమాళ్ళు | rumaallu | Noun | scarves; cloths |
| వాసన | vaasana | Noun | smell; scent |
| ఆరిన తర్వాత | aarina tarvaata | Phrase | after it dries |
| కుట్టుకుంటాడు | kuttukuntaadu | Verb | he will sew |
| చీరలు | cheeralu | Noun | saris |
| గాలికి | gaaliki | Noun form | in the wind |
| పక్షులు | pakshulu | Noun | birds |
| రెక్కల్ని | rekkalni | Noun form | wings (object form) |
| దండెం | dandem | Noun | clothesline |
| వెచ్చగా | vechchagaa | Adverb | warm |
| అన్నయ్య | annayya | Noun | older brother |
| మరకలు | marakalu | Noun | stains |
| దుమ్ము | dummu | Noun | dust |
| రుద్దాము | ruddaamu | Verb | we scrubbed |
| మురికి | muriki | Noun / adjective | dirt; dirty |
Source: బట్టల్నీ ఉతికేశాం!, Telugu translation by Radha M (© 2020), based on Laundry Day by Mathangi Subramanian (© Pratham Books, 2018), on StoryWeaver, CC BY 4.0. English translation, reading help, narration and new illustration by LangFastPro.




