చిన్నారుల చేతిపని — The Children’s Handiwork

LangFastPro Editorial Team's avatar
Lesson prepared byLangFastPro Editorial Team
More

కథలతో తెలుగు నేర్చుకోండి.

Section 1: Telugu Story

చిన్నారుల చేతిపని — The Children’s Handiwork

Two children paint a garden gate red and green while their mother watches.

Listen to the story0:00 / 0:00

అవి సెలవు రోజులు. వీణ, వినయ్ తోటలో ఉన్నారు. ఎక్కడ చూసినా రంగుల డబ్బాలు పడి ఉన్నాయి.

తెల్ల రంగు ఉంది. ఎర్ర రంగు ఉంది. ఆకుపచ్చ, నీలం, పసుపు రంగులు ఉన్నాయి.

రంగులు వేసేవాళ్ళు చాలా పనిలో ఉన్నారు. ఒకతను నిచ్చెన మీద ఉన్నాడు. ఇంకొక అతను ఉయ్యాలలాగ బల్ల కట్టుకుని కప్పు నుంచి వేలాడుతున్నాడు. ‘‘మేము మీకు ఏదన్నా సహాయం చేయవచ్చా?’’ అని అని అడిగారు వీణా, వినయ్ లు.

పెయింటర్ వాళ్ళిద్దరికీ చెరో బ్రష్షు ఇచ్చాడు. “నువ్వు గేటు లోపల రంగు వెయ్యి,” అన్నాడు వీణతో. “నువ్వు గేటు బయట రంగు వేయి,” అన్నాడు వినయ్‌తో.

వాళ్ళు రెండు డబ్బాల రంగు తీసుకుని పని మొదలు పెట్టారు. వీణ గేటుకి ఒక వైపు రంగు వేసింది. వినయ్ గేటు రెండో వేపు రంగు వేశాడు.

రంగు నేల మీద పడింది. గోడ మీద పడింది. వాళ్ళ మీదా పడింది.

చివరికి ఎలాగో పూర్తి చేశారు. నేలమీద చిందిన రంగు అంతా తుడిచారు. గోడ మీద పడ్డ రంగునీ తుడిచారు.

తమ మీద పడ్డ రంగునీ వారు తుడుచుకున్నారు.

“నా ఎర్ర గేటు అంటే నాకెంత ఇష్టమో,” అన్నది వీణ.

“నా ఆకుపచ్చ గేటు అంటే నాకెంత ఇష్టమో,” అన్నాడు వినయ్.

“అయ్యో, మీరు రెండు రంగుల గేటు చేసిపెట్టారే,” అని అరిచాడు రంగులు వేసే ఆయన. “అలాగే ఉండనివ్వండి,” అన్నది అమ్మ.

Section 2: Sentence-by-Sentence Translation

No.TeluguEnglish
1అవి సెలవు రోజులు.It was the holidays.
2వీణ, వినయ్ తోటలో ఉన్నారు.Veena and Vinay were in the garden.
3ఎక్కడ చూసినా రంగుల డబ్బాలు పడి ఉన్నాయి.There were tins of paint everywhere they looked.
4తెల్ల రంగు ఉంది.There was white paint.
5ఎర్ర రంగు ఉంది.There was red paint.
6ఆకుపచ్చ, నీలం, పసుపు రంగులు ఉన్నాయి.There were green, blue and yellow paints.
7రంగులు వేసేవాళ్ళు చాలా పనిలో ఉన్నారు.The painters were very busy.
8ఒకతను నిచ్చెన మీద ఉన్నాడు.One was on a ladder.
9ఇంకొక అతను ఉయ్యాలలాగ బల్ల కట్టుకుని కప్పు నుంచి వేలాడుతున్నాడు.Another was hanging from the roof on a board tied like a swing.
10‘‘మేము మీకు ఏదన్నా సహాయం చేయవచ్చా?’’ అని అని అడిగారు వీణా, వినయ్ లు.“Can we help you with anything?” asked Veena and Vinay.
11పెయింటర్ వాళ్ళిద్దరికీ చెరో బ్రష్షు ఇచ్చాడు.The painter gave each of them a brush.
12“నువ్వు గేటు లోపల రంగు వెయ్యి,” అన్నాడు వీణతో.“You paint the inside of the gate,” he told Veena.
13“నువ్వు గేటు బయట రంగు వేయి,” అన్నాడు వినయ్‌తో.“You paint the outside of the gate,” he told Vinay.
14వాళ్ళు రెండు డబ్బాల రంగు తీసుకుని పని మొదలు పెట్టారు.They took two tins of paint and began working.
15వీణ గేటుకి ఒక వైపు రంగు వేసింది.Veena painted one side of the gate.
16వినయ్ గేటు రెండో వేపు రంగు వేశాడు.Vinay painted the other side.
17రంగు నేల మీద పడింది.Paint fell on the ground.
18గోడ మీద పడింది.It fell on the wall.
19వాళ్ళ మీదా పడింది.It fell on them too.
20చివరికి ఎలాగో పూర్తి చేశారు.At last, they somehow finished.
21నేలమీద చిందిన రంగు అంతా తుడిచారు.They wiped up all the paint spilled on the ground.
22గోడ మీద పడ్డ రంగునీ తుడిచారు.They wiped the paint off the wall too.
23తమ మీద పడ్డ రంగునీ వారు తుడుచుకున్నారు.They also wiped the paint off themselves.
24“నా ఎర్ర గేటు అంటే నాకెంత ఇష్టమో,” అన్నది వీణ.“How I love my red gate,” said Veena.
25“నా ఆకుపచ్చ గేటు అంటే నాకెంత ఇష్టమో,” అన్నాడు వినయ్.“How I love my green gate,” said Vinay.
26“అయ్యో, మీరు రెండు రంగుల గేటు చేసిపెట్టారే,” అని అరిచాడు రంగులు వేసే ఆయన.“Oh dear, you’ve made a two-coloured gate!” cried the painter.
27“అలాగే ఉండనివ్వండి,” అన్నది అమ్మ.“Let it stay that way,” said Mother.

Section 3: Vocabulary

TeluguPronunciationPart of speechMeaning
సెలవుselavunounholiday; leave
తోటtotanoungarden
రంగుrangunouncolour; paint
తెల్లtellaadjectivewhite
ఎర్రerraadjectivered
ఆకుపచ్చaakupachchanoun/adjectivegreen
నీలంneelamnoun/adjectiveblue
పసుపుpasupunounyellow; turmeric
గోడgodanounwall
నిచ్చెనnichchenanounladder

The pronunciation spellings are simple reading aids. Aa, ee and oo mark long vowels. Short and long e/o share the same simple spelling here, and some distinct consonants do too; check the Telugu letters and listen to the sounds.

Continue your language learning journey with these lessons:

Source: చిన్నారుల చేతిపని by Cheryl Rao, Telugu translation by Janaki Rani Turaga, from the Pratham Books collection, CC BY 4.0. Telugu text retained from the Global ASP edition; layout changed. English translation and learning notes by LangFastPro. Source illustrations are not reproduced.

Related lessons