వార్షిక క్షవర దినం — The Annual Haircut Day

LangFastPro Editorial Team's avatar
Lesson prepared byLangFastPro Editorial Team
More

కథలతో తెలుగు నేర్చుకోండి.

Section 1: Telugu Story

వార్షిక క్షవర దినం — The Annual Haircut Day

A man with very long hair walks through a sunny village towards a barber shop.

Listen to the story0:00 / 0:00

శృంగేరీ శ్రీనివాస్‌కి ఆ రోజు వార్షిక క్షవర దినం.

తమ మంగలి దగ్గరకు వెళ్ళటానికి ఇంటి నుండి త్వరగా బయలుదేరాడు శృంగేరీ శ్రీనివాస్.

కానీ మంగలి ఇలా అన్నాడు "ఈ రోజు ఇంత పొడువాటి జుట్టు కత్తిరించేందుకు సమయం లేదు."

నిరాశతో శృంగేరీ శ్రీనివాస్ తన భార్యను సహాయం చేయమని అడగటానికి ఇంటికి తిరిగి వెళ్ళాడు.

కాని ఆతని భార్య అన్నది “ఈ రోజు ఇంత పొడువు జుట్టు కత్తిరించేందుకు నా వద్ద సమయం లేదు” అని.

కొంచెం కోపంగా, శృంగేరీ శ్రీనివాస్ తన స్నేహితుడైన దర్జీ దగ్గరకు వెళ్ళాడు.

కానీ దర్జీ అన్నాడు “ఈ రోజు ఇంత పొడుగు జుట్టు కత్తిరించేందుకు నా దగ్గర సమయం లేదు” అని.

అప్పుడు కాస్త దిగులుగా. తన మరొక స్నేహితుడు వడ్రంగి దగ్గరకు వెళ్ళాడు.

కానీ వడ్రంగి కూడా ఇలా అన్నాడు “ఈ రోజు ఇంత జుట్టు కత్తిరించేందుకు నా వద్ద సమయం లేదు” అని.

పాపం! శృంగేరీ శ్రీనివాస్. అతని వార్షిక క్షవర దినం రోజున అతనికి ఎవ్వరూ క్షవరం చేసేలా లేరు.

కన్నీళ్ళతో గ్రామం దాటి అడవిలోకి నడిచి వెళ్ళాడు.

ఒక గుహ దగ్గర బిగ్గరగా ఏడుస్తూ కూర్చున్నాడు.

“ఈ రోజు అయిపోవచ్చింది. జుట్టు కత్తిరించుకుంటానన్న ఒట్టు మీద ఎలా నిలబడటం? ఓ దేవుడా నాకు సాయం చెయ్యి!”

గుహలోపల ప్రశాంతంగా నిద్రపోతున్న పులికి ఈ చప్పుడుతో నిద్రాభంగం అయ్యింది.

అది గాండ్రిస్తూ, తన రాక్షసి పంజాలను చూపుతూ శృంగేరీ శ్రీనివాస్ పైకి వచ్చింది.

పాపం శృంగేరీ శ్రీనివాస్ ఎంత భయపడ్డాడంటే , ఎంత భయపడ్డాడంటే, ఎంత భయపడ్డాడంటే...

అతని తల మీద జుట్టు అంతా రాలిపోయింది.

శృంగేరీ శ్రీనివాస్ గ్రామం వైపుకు పరిగెట్టాడు.

పెద్ద పులి మళ్ళీ నిద్రలోకి జారుకుంది.

Section 2: Sentence-by-Sentence Translation

No.TeluguEnglish
1శృంగేరీ శ్రీనివాస్‌కి ఆ రోజు వార్షిక క్షవర దినం.It was Sringeri Srinivas’s annual haircut day.
2తమ మంగలి దగ్గరకు వెళ్ళటానికి ఇంటి నుండి త్వరగా బయలుదేరాడు శృంగేరీ శ్రీనివాస్.Sringeri Srinivas left home early to go to his barber.
3కానీ మంగలి ఇలా అన్నాడు "ఈ రోజు ఇంత పొడువాటి జుట్టు కత్తిరించేందుకు సమయం లేదు."But the barber said, “I don’t have time to cut such long hair today.”
4నిరాశతో శృంగేరీ శ్రీనివాస్ తన భార్యను సహాయం చేయమని అడగటానికి ఇంటికి తిరిగి వెళ్ళాడు.Disappointed, Sringeri Srinivas went home to ask his wife for help.
5కాని ఆతని భార్య అన్నది “ఈ రోజు ఇంత పొడువు జుట్టు కత్తిరించేందుకు నా వద్ద సమయం లేదు” అని.But his wife said, “I don’t have time to cut such long hair today.”
6కొంచెం కోపంగా, శృంగేరీ శ్రీనివాస్ తన స్నేహితుడైన దర్జీ దగ్గరకు వెళ్ళాడు.A little angry, Sringeri Srinivas went to his friend, the tailor.
7కానీ దర్జీ అన్నాడు “ఈ రోజు ఇంత పొడుగు జుట్టు కత్తిరించేందుకు నా దగ్గర సమయం లేదు” అని.But the tailor said, “I don’t have time to cut such long hair today.”
8అప్పుడు కాస్త దిగులుగా. తన మరొక స్నేహితుడు వడ్రంగి దగ్గరకు వెళ్ళాడు.Now he felt rather sad. He went to another friend, the carpenter.
9కానీ వడ్రంగి కూడా ఇలా అన్నాడు “ఈ రోజు ఇంత జుట్టు కత్తిరించేందుకు నా వద్ద సమయం లేదు” అని.But the carpenter too said, “I don’t have time to cut so much hair today.”
10పాపం! శృంగేరీ శ్రీనివాస్. అతని వార్షిక క్షవర దినం రోజున అతనికి ఎవ్వరూ క్షవరం చేసేలా లేరు.Poor man! Sringeri Srinivas! It seemed that nobody would cut his hair on his annual haircut day.
11కన్నీళ్ళతో గ్రామం దాటి అడవిలోకి నడిచి వెళ్ళాడు.In tears, he walked out of the village and into the forest.
12ఒక గుహ దగ్గర బిగ్గరగా ఏడుస్తూ కూర్చున్నాడు.He sat near a cave and cried loudly.
13“ఈ రోజు అయిపోవచ్చింది. జుట్టు కత్తిరించుకుంటానన్న ఒట్టు మీద ఎలా నిలబడటం? ఓ దేవుడా నాకు సాయం చెయ్యి!”“The day is almost over. How can I keep my promise to get my hair cut? Oh God, help me!”
14గుహలోపల ప్రశాంతంగా నిద్రపోతున్న పులికి ఈ చప్పుడుతో నిద్రాభంగం అయ్యింది.The noise disturbed a tiger sleeping peacefully inside the cave.
15అది గాండ్రిస్తూ, తన రాక్షసి పంజాలను చూపుతూ శృంగేరీ శ్రీనివాస్ పైకి వచ్చింది.Roaring and showing its enormous claws, it came towards Sringeri Srinivas.
16పాపం శృంగేరీ శ్రీనివాస్ ఎంత భయపడ్డాడంటే , ఎంత భయపడ్డాడంటే, ఎంత భయపడ్డాడంటే...Poor Sringeri Srinivas was so frightened, so frightened, so frightened…
17అతని తల మీద జుట్టు అంతా రాలిపోయింది.All the hair on his head fell out.
18శృంగేరీ శ్రీనివాస్ గ్రామం వైపుకు పరిగెట్టాడు.Sringeri Srinivas ran towards the village.
19పెద్ద పులి మళ్ళీ నిద్రలోకి జారుకుంది.The big tiger went back to sleep.

Section 3: Vocabulary

TeluguPronunciationPart of speechMeaning
జుట్టుjuttunounhair
సమయంsamayamnountime
భార్యbhaaryanounwife
స్నేహితుడుsnehitudunounmale friend
దర్జీdarjeenountailor
వడ్రంగిvadranginouncarpenter
గ్రామంgraamamnounvillage
అడవిadavinounforest
గుహguhanouncave
పులిpulinountiger

The pronunciation spellings are simple reading aids. Aa, ee and oo mark long vowels. Short and long e/o share the same simple spelling here, and some distinct consonants do too; check the Telugu letters and listen to the sounds.

Continue your language learning journey with these lessons:

Source: వార్షిక క్షవర దినం by Rohini Nilekani, Telugu translation by Ambika Ananth, from the Pratham Books collection, CC BY 4.0. Telugu text retained from the Global ASP edition; layout changed. English translation and learning notes by LangFastPro. Source illustrations are not reproduced.

Related lessons