కథలతో తెలుగు నేర్చుకోండి.
Section 1: Telugu Story
నా చేప! కాదు, నా చేప! — My Fish! No, My Fish!

కిచ్చు ఒక రోజు ప్రొద్దున్నే లేచేశాడు. “కొన్ని చేపలు పట్టడానికి ఇది సరైన సమయం,” ఆవులిస్తూ అనుకొన్నాడు.
చెరువుకు వెళ్ళే దోవలో చోరూని కలిశాడు. మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ. కలిసి ఆడుకొంటారు రోజూ.
తమ చేపల వలలు పట్టుకొని వాళ్ళు గబగబా వెళ్లడం మునియా చూసింది. “మేము చేపలు పట్టడానికి చెరువుకి వెలుతున్నాము. మునియా, కావాలంటే నువ్వు కూడా రావచ్చు!”
చిన్నారి మునియా కొంతసేపు ఆలోచించింది. “దయచేసి ఆ పని చేయవద్దు, నీళ్లు లేకపోతే చేపలు చచ్చిపోతాయి,” అన్నది.
మునియా చెప్పింది వినలేదు వాళ్ళు. సరాసరి నేరుగా చెరువు దగ్గరకు వెళ్లారు. కిచ్చు, చోరూ చెరువు ప్రక్కన కూర్చున్నారు. చేపల కోసం చూస్తున్నారు.
రెండు చేపలు ఈదుకొంటూ వచ్చాయి. ఒకటి సన్నగానూ, రెండోది లావుగానూ ఉన్నాయి.
ఆ వెనకాలే మూడోది, ఒక పెద్ద చేప వచ్చింది. తాము ఎన్నడూ చూడనంత పెద్దది అది. మునియా నవ్వేస్తూ అన్నది, “ఇది నాన్న పాదం కంటే పెద్దది కదూ!”
కిచ్చు, చోరూ తమ గాలాలు గట్టిగా పట్టుకుని ఉన్నారు. “ఇది నా చేప!” అని అరిచాడు కిచ్చు. “కాదు, ఇది నా చేప!” కూడా అరిచాడు చోరూ.
కిచ్చు గట్టిగా లాగాడు. చోరూ ఇంకా గట్టిగా లాగాడు.
ఫాట్ట్ట్ట్! రెండు గాలం కర్రలూ విరిగిపోయాయి. థ డ్డ్డ్డ్! కిచ్చు నేల మీద పడి పోయాడు. థడ్డ్డ్డ్ స్ప్లాష్ష్ష్ష్! చోరూ నీళ్ళల్లో పడిపోయాడు.
ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది అనుకొంటున్నారు? హ హ హ! ఆ తెలివైన చేప రెండు తీగలనీ కట్టి పడేసింది!
Section 2: Sentence-by-Sentence Translation
| No. | Telugu | English |
|---|---|---|
| 1 | కిచ్చు ఒక రోజు ప్రొద్దున్నే లేచేశాడు. | Kichchu woke up early one morning. |
| 2 | “కొన్ని చేపలు పట్టడానికి ఇది సరైన సమయం,” ఆవులిస్తూ అనుకొన్నాడు. | “This is just the time to catch some fish,” he thought with a yawn. |
| 3 | చెరువుకు వెళ్ళే దోవలో చోరూని కలిశాడు. | On the way to the pond, he met Choru. |
| 4 | మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ. | The two were good friends. |
| 5 | కలిసి ఆడుకొంటారు రోజూ. | They played together every day. |
| 6 | తమ చేపల వలలు పట్టుకొని వాళ్ళు గబగబా వెళ్లడం మునియా చూసింది. | Muniya saw them hurrying along with their fishing nets. |
| 7 | “మేము చేపలు పట్టడానికి చెరువుకి వెలుతున్నాము. | “We are going to the pond to catch fish. |
| 8 | మునియా, కావాలంటే నువ్వు కూడా రావచ్చు!” | Muniya, you can come too if you like!” |
| 9 | చిన్నారి మునియా కొంతసేపు ఆలోచించింది. | Little Muniya thought for a moment. |
| 10 | “దయచేసి ఆ పని చేయవద్దు, నీళ్లు లేకపోతే చేపలు చచ్చిపోతాయి,” అన్నది. | “Please don’t do that. Fish will die without water,” she said. |
| 11 | మునియా చెప్పింది వినలేదు వాళ్ళు. | They did not listen to Muniya. |
| 12 | సరాసరి నేరుగా చెరువు దగ్గరకు వెళ్లారు. | They went straight to the pond. |
| 13 | కిచ్చు, చోరూ చెరువు ప్రక్కన కూర్చున్నారు. | Kichchu and Choru sat beside the pond. |
| 14 | చేపల కోసం చూస్తున్నారు. | They looked for fish. |
| 15 | రెండు చేపలు ఈదుకొంటూ వచ్చాయి. | Two fish swam towards them. |
| 16 | ఒకటి సన్నగానూ, రెండోది లావుగానూ ఉన్నాయి. | One was thin and the other was fat. |
| 17 | ఆ వెనకాలే మూడోది, ఒక పెద్ద చేప వచ్చింది. | Behind them came a third fish, a big one. |
| 18 | తాము ఎన్నడూ చూడనంత పెద్దది అది. | It was bigger than any fish they had ever seen. |
| 19 | మునియా నవ్వేస్తూ అన్నది, “ఇది నాన్న పాదం కంటే పెద్దది కదూ!” | Muniya laughed and said, “It’s bigger than Father’s foot, isn’t it?” |
| 20 | కిచ్చు, చోరూ తమ గాలాలు గట్టిగా పట్టుకుని ఉన్నారు. | Kichchu and Choru held their fishing rods tightly. |
| 21 | “ఇది నా చేప!” అని అరిచాడు కిచ్చు. | “This is my fish!” shouted Kichchu. |
| 22 | “కాదు, ఇది నా చేప!” కూడా అరిచాడు చోరూ. | “No, this is my fish!” shouted Choru too. |
| 23 | కిచ్చు గట్టిగా లాగాడు. | Kichchu pulled hard. |
| 24 | చోరూ ఇంకా గట్టిగా లాగాడు. | Choru pulled even harder. |
| 25 | ఫాట్ట్ట్ట్! | Crack! |
| 26 | రెండు గాలం కర్రలూ విరిగిపోయాయి. | Both fishing rods broke. |
| 27 | థ డ్డ్డ్డ్! | Thud! |
| 28 | కిచ్చు నేల మీద పడి పోయాడు. | Kichchu fell to the ground. |
| 29 | థడ్డ్డ్డ్ స్ప్లాష్ష్ష్ష్! | Thud! Splash! |
| 30 | చోరూ నీళ్ళల్లో పడిపోయాడు. | Choru fell into the water. |
| 31 | ఏం జరిగింది? | What happened? |
| 32 | ఏం జరిగింది? | What happened? |
| 33 | ఏం జరిగింది అనుకొంటున్నారు? | What do you think happened? |
| 34 | హ హ హ! | Ha ha ha! |
| 35 | ఆ తెలివైన చేప రెండు తీగలనీ కట్టి పడేసింది! | That clever fish had tied the two lines together! |
Section 3: Vocabulary
| Telugu | Pronunciation | Part of speech | Meaning |
|---|---|---|---|
| చేప | chepa | noun | fish |
| చెరువు | cheruvu | noun | pond |
| నీళ్లు | neellu | noun | water |
| స్నేహితులు | snehitulu | noun | friends |
| రోజూ | rojoo | adverb | every day |
| రెండు | rendu | number | two |
| పెద్ద | pedda | adjective | big |
| పాదం | paadam | noun | foot |
| నేల | nela | noun | ground; floor |
| తెలివైన | telivaina | adjective | clever |
The pronunciation spellings are simple reading aids. Aa, ee and oo mark long vowels. Short and long e/o share the same simple spelling here, and some distinct consonants do too; check the Telugu letters and listen to the sounds.
Continue your language learning journey with these lessons:
Source: నా చేప! కాదు, నా చేప! by Suraj J Menon, Telugu translation by Janaki Rani Turaga, from the Pratham Books collection, CC BY 4.0. Telugu text retained from the Global ASP edition; layout changed. English translation and learning notes by LangFastPro. Source illustrations are not reproduced.




