నిద్రపోతు భీమా — Sleepy Bhima

LangFastPro Editorial Team's avatar
Lesson prepared byLangFastPro Editorial Team
More

కథలతో తెలుగు నేర్చుకోండి.

Section 1: Telugu Story

నిద్రపోతు భీమా — Sleepy Bhima

A sleepy donkey rests near a cow, dog, rooster and crow as a tiny fly approaches.

Listen to the story0:00 / 0:00

భీమాకి నిద్రపోవటం మహా ఇష్టం. పెందరాళే నిద్ర నుండి మెలకువ రాదు. అందుకోసమే చాకలి రాము భీమాని ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు.

ఒకరోజున ఆవు గౌరి, అడిగింది వాడిని. “భీమా నువ్వెందుకు అంత విచారంగా ఉన్నావ్?” అని. భీమా అన్నాడు, “నేను ప్రొద్దుటే నిద్రలేవలేను. అందుకే రామూ నన్ను రోజూ తిడతాడు. నన్ను ప్రతి ఉదయం నిద్రలేపవూ?” అడిగాడు భీమా. “ఓ తప్పకుండా,” అంది గౌరి. మర్నాడు ఉదయాన్నే, గౌరి అంబా అంటూ గట్టిగా అరిచింది, కాని భీమా నిద్ర లేవలేదు.

సాయంకాలం నది ఒడ్డునుండి తిరిగి వస్తూంటే, భీమాకి కుక్క మోతీ కనిపించింది. “పొద్దుటే నాకు మెలకువ రావటం లేదు. నన్ను నువ్వు లేపుతావా?” భీమా మోతీని అడిగాడు. “ఓ తప్పకుండా అంది మోతీ,” మర్నాడు ఉదయాన్నే అది మొరిగింది. మొరుగుతూనే ఉంది. కాని భీమా లేచాడంటారా? లేదండోయ్!

ఆ సాయకాలం భీమా, కోడి పుంజు చీనూని కలుసుకున్నాడు. “నువ్వు రోజూ కొక్కరొకో అంటూ కూయగానే అందరూ నిద్ర లేస్తారు. మరి నన్ను కూడా నిద్ర లేపవూ?” అన్నాడు చీనూతో. చీనూ అంగీకరించింది. మర్నాడు ఉదయాన్నే చీనూ కూసింది కొక్కరకొ అంటూ బిగ్గరగా, ఇంకా బిగ్గరగా కూస్తూనే ఉంది. కాని భీమా మాత్రం మేలుకోలేదు.

మర్నాడు సాయంకాలం, భీమా కాకి, కాలూ, సంతోషంగా కావుకావుమంటూండటం చూసాడు. “కాలూ, నన్ను నువ్వు పొద్దుటే నిద్రలేపవా?” అని అడిగాడు. “ఎందుకు లేపనూ? కావు కావు మంటూ నిన్ను నిద్ర లేపేస్తా సరేనా?” అంది కాలూ. మర్నాడు ఉదయం కాలూ గొంతు నొప్పి పుట్టేదాకా కావుకావుమంటూనే ఉంది. కాని నిద్ర పోతు భీమాకి మాత్రం మెలకువే రాలేదు.

భీమా చాలా విచారంగా ఉన్నాడు. మర్నాడు ఉదయం, ఒక ఈగ వచ్చి, వాడి ముక్కు మీద కూర్చుంది. “హా...హాచ్చి... హా...చ్చి!” ముక్కు గులగుల పెట్టేసరికి భీమా పెద్దగా తుమ్ముతూ లేచేసాడు.

“భలే! భలే! నేను లేచేసాను, నేనెలా లేచాను?” ఆశ్చర్యంగా తనని తనే ప్రశ్నించుకున్నాడు. “నేనే నిద్ర లేపా,” అంది ఈగ. “నన్ను ప్రతి ఉదయం ఇలా గే నిద్ర లేపుతావా?” “తప్పకుండా,” అంది ఈగ. భీమాకి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక ప్రొద్దున్నే నిద్ర లేవటం కష్టమే అనిపించటం లేదు!

Section 2: Sentence-by-Sentence Translation

No.TeluguEnglish
1భీమాకి నిద్రపోవటం మహా ఇష్టం.Bhima loved sleeping.
2పెందరాళే నిద్ర నుండి మెలకువ రాదు.He could not wake up early.
3అందుకోసమే చాకలి రాము భీమాని ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు.That was why Ramu, the washerman, was always scolding Bhima.
4ఒకరోజున ఆవు గౌరి, అడిగింది వాడిని. “భీమా నువ్వెందుకు అంత విచారంగా ఉన్నావ్?” అని.One day, Gauri the cow asked him, “Bhima, why are you so sad?”
5భీమా అన్నాడు, “నేను ప్రొద్దుటే నిద్రలేవలేను.Bhima said, “I can’t wake up early in the morning.
6అందుకే రామూ నన్ను రోజూ తిడతాడు.That is why Ramu scolds me every day.
7నన్ను ప్రతి ఉదయం నిద్రలేపవూ?” అడిగాడు భీమా.Will you wake me up every morning?” asked Bhima.
8“ఓ తప్పకుండా,” అంది గౌరి.“Oh, certainly,” said Gauri.
9మర్నాడు ఉదయాన్నే, గౌరి అంబా అంటూ గట్టిగా అరిచింది, కాని భీమా నిద్ర లేవలేదు.Early the next morning, Gauri mooed loudly, but Bhima did not wake up.
10సాయంకాలం నది ఒడ్డునుండి తిరిగి వస్తూంటే, భీమాకి కుక్క మోతీ కనిపించింది.That evening, on his way back from the riverbank, Bhima saw Moti the dog.
11“పొద్దుటే నాకు మెలకువ రావటం లేదు.“I can’t wake up in the morning.
12నన్ను నువ్వు లేపుతావా?” భీమా మోతీని అడిగాడు.Will you wake me up?” Bhima asked Moti.
13“ఓ తప్పకుండా అంది మోతీ,” మర్నాడు ఉదయాన్నే అది మొరిగింది.“Oh, certainly,” said Moti. Early the next morning, the dog barked.
14మొరుగుతూనే ఉంది.And kept barking.
15కాని భీమా లేచాడంటారా?But do you think Bhima woke up?
16లేదండోయ్!Not at all!
17ఆ సాయకాలం భీమా, కోడి పుంజు చీనూని కలుసుకున్నాడు.That evening, Bhima met Chinu the rooster.
18“నువ్వు రోజూ కొక్కరొకో అంటూ కూయగానే అందరూ నిద్ర లేస్తారు.“Everyone wakes up when you crow cock-a-doodle-doo each day.
19మరి నన్ను కూడా నిద్ర లేపవూ?” అన్నాడు చీనూతో.Will you wake me up too?” he asked Chinu.
20చీనూ అంగీకరించింది.Chinu agreed.
21మర్నాడు ఉదయాన్నే చీనూ కూసింది కొక్కరకొ అంటూ బిగ్గరగా, ఇంకా బిగ్గరగా కూస్తూనే ఉంది.Early the next morning, Chinu crowed cock-a-doodle-doo loudly, then louder and louder.
22కాని భీమా మాత్రం మేలుకోలేదు.But Bhima still did not wake up.
23మర్నాడు సాయంకాలం, భీమా కాకి, కాలూ, సంతోషంగా కావుకావుమంటూండటం చూసాడు.The next evening, Bhima saw Kalu the crow cawing happily.
24“కాలూ, నన్ను నువ్వు పొద్దుటే నిద్రలేపవా?” అని అడిగాడు.“Kalu, will you wake me up early in the morning?” he asked.
25“ఎందుకు లేపనూ?“Of course I will!
26కావు కావు మంటూ నిన్ను నిద్ర లేపేస్తా సరేనా?” అంది కాలూ.I’ll caw and caw to wake you up, all right?” said Kalu.
27మర్నాడు ఉదయం కాలూ గొంతు నొప్పి పుట్టేదాకా కావుకావుమంటూనే ఉంది.The next morning, Kalu kept cawing until its throat hurt.
28కాని నిద్ర పోతు భీమాకి మాత్రం మెలకువే రాలేదు.But sleepy Bhima still did not wake up.
29భీమా చాలా విచారంగా ఉన్నాడు.Bhima was very sad.
30మర్నాడు ఉదయం, ఒక ఈగ వచ్చి, వాడి ముక్కు మీద కూర్చుంది.The next morning, a fly came and sat on his nose.
31“హా...హాచ్చి... హా...చ్చి!” ముక్కు గులగుల పెట్టేసరికి భీమా పెద్దగా తుమ్ముతూ లేచేసాడు.“Ah… ah-choo… Ah-choo!” His nose tickled, and Bhima woke up with a great sneeze.
32“భలే! భలే! నేను లేచేసాను, నేనెలా లేచాను?” ఆశ్చర్యంగా తనని తనే ప్రశ్నించుకున్నాడు.“Wonderful! Wonderful! I’m awake! How did I wake up?” he asked himself in surprise.
33“నేనే నిద్ర లేపా,” అంది ఈగ.“I woke you,” said the fly.
34“నన్ను ప్రతి ఉదయం ఇలా గే నిద్ర లేపుతావా?” “తప్పకుండా,” అంది ఈగ.“Will you wake me up like this every morning?” “Certainly,” said the fly.
35భీమాకి చాలా సంతోషంగా ఉంది.Bhima was very happy.
36ఇప్పుడు ఇక ప్రొద్దున్నే నిద్ర లేవటం కష్టమే అనిపించటం లేదు!Now waking up early in the morning no longer seemed difficult!

Section 3: Vocabulary

TeluguPronunciationPart of speechMeaning
నిద్రnidranounsleep
ఆవుaavunouncow
ఉదయంudayamnounmorning
కుక్కkukkanoundog
నదిnadinounriver
కోడి పుంజుkodi punjunounrooster
కాకిkaakinouncrow
ఈగeeganounfly
ముక్కుmukkunounnose
గొంతుgontunounthroat

The pronunciation spellings are simple reading aids. Aa, ee and oo mark long vowels. Short and long e/o share the same simple spelling here, and some distinct consonants do too; check the Telugu letters and listen to the sounds.

Continue your language learning journey with these lessons:

Source: నిద్రపోతు భీమా by Kiran Kasturia, Telugu translation by Jayashree Rao, from the Pratham Books collection, CC BY 4.0. Telugu text retained from the Global ASP edition; layout changed. English translation and learning notes by LangFastPro. Source illustrations are not reproduced.

Related lessons